అభిమాని నుండి క‌థానాయిక‌గా..ఆనందం వ్య‌క్తం చేసిన మ‌హాన‌టి

అలనాటి అందాల తార సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన న‌టి కీర్తి సురేష్‌. చిత్రంలో సావిత్రిగా మంచి అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఆమె పాత్ర‌పై విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీలో ప‌లు సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్‌కి ర‌జనీకాంత్ 168వ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని సోష‌ల్ మీడియా ద్వారా వ్య‌క్తం చేసింది.


ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ అభిమానిగా ఉన్న నేను ఇప్పుడు ఆయ‌న స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం పొందాను. ఇది నా జీవితంలో ఎప్ప‌టికి గుర్తు ఉంటుంది. ర‌జ‌నీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు చాలా ఆస‌క్తిగా ఉన్నాను అని కీర్తి సురేష్ వీడియో ద్వారా తెలిపారు. శివ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ 168వ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, స‌న్ పిక్చ‌ర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాలుగు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు రూపొందుతున్నాయి. తెలుగులో మిస్ ఇండియా అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో పాటు నితిన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రంగ్ దే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, రజనీకాంత్ న‌టించిన ద‌ర్భార్ చిత్రం సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీని మురుగ‌దాస్ తెరకెక్కించారు.